గత కొన్ని రోజులుగా సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఆ గొడవలు ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేసిన సంఘటకూడా అందరికీ తెలిసినదే. ఈ ఘటనలో ఆ మీడియా ప్రతినిధికి గాయాలు కావటం, అందుకు ఆగ్రహించిన మీడియా ప్రతినిధులు మోహన్ బాబు జర్నలిస్టులకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటం..
జరిగిందాంట్లో నా తప్పేమీ లేదు నేను క్షమాపణలు చెప్పను అని మోహన్ బాబు చెప్పడం ఇవన్నీ అందరికీ తెలిసినదే. అయితే జరిగిన గొడవల కారణంగా మోహన్ బాబుకి కూడా రక్తపోటు పెరగటంతో ఆయన కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే హాస్పిటల్ నుంచి విడుదలైన మోహన్ బాబు క్షమాపణ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు ఉన్నారు, రిపోర్టర్ పై దాడికి సంబంధించి క్షమాపణలు చెబుతున్నట్టు ఒక లెటర్ విడుదల చేశారు.
ఆ లెటర్ లో ఏముందంటే జరిగిన సంఘటన పట్ల ప్రగాఢ విచారం వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నాను వ్యక్తిగత కుటుంబ వివాదంగా ప్రారంభమైన సంఘటన ఇంత పెద్ద పరిస్థితికి దారితీసింది. ఇది జర్నలిస్టు సోదరులకు కూడా బాధ కలిగించడం నాకు బాధ కలిగింది. నేను 48 గంటల పాటు హాస్పిటల్లో ఉండటం వలన వెంటనే స్పందించలేకపోయాను. దాదాపు 50 మంది వ్యక్తులు సంఘ వ్యతిరేక శక్తులు హాని చేయాలనే ఉద్దేశంతో నా ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాయి.
అక్కడ ఉన్నవారు, నేనూ ప్రశాంతతని కోల్పోయాము. ఈ గందరగోళం మధ్య మీ జర్నలిస్టులో ఒకరైన రంజిత్ కి దురదృష్టవశాత్తు గాయమైంది, ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమే కానీ ఉద్దేశ్య పూర్వకంగా చేసిన దాడి కాదు అయినా నా చర్యలకు నేను హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను మరియు నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ లేఖని ముగించారు.
— Mohan Babu M (@themohanbabu) December 13, 2024