ఇస్మార్ట్ బ్యూటీ టార్గెట్ ఏకంగా ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్సే..?

నభా నటేష్ .. నన్ను దోచుకుందవటే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనప్పటికి అంతగా ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. కాని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరక్కించిన ఇస్మార్ట్ శంకర్ తో లైం లైట్ లోకి వచ్చింది. ఈ సినిమాతో నభా కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతాకాదు. మాస్ ఆడియన్స్.. యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత డిస్కోరాజా అన్న సినిమా చేసింది. మాస్ మహారాజ రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

Nabha Natesh Hot PhotoShoot - YouTube

అయినప్పటికి నభా మాత్రం తన గ్లామర్ తో ఒక మెట్టు పైకెక్కింది. కాని చాలామంది ఇక నభా కి అవకాశాలు అంతమత మాత్రమే పెద్ద సినిమాలు రావడం కష్టం అనుకున్నారు. కాని రివర్స్ లో షాకిచ్చింది. వరసగా సినిమాలు సైన్ చేస్తూ టాప్ హీరోయిన్స్ పక్కన నిలిచింది. ప్రస్తుతం నభా కి టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది. అంతేకాదు కరోనా కాలంలో కూడా రెమ్యూనరేషన్ పరంగా బాగానే డిమాండ్ చేస్తుంది. అయినా మేకర్స్ నభా డేట్స్ కావాలని క్యూ కడుతున్నారు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా చేస్తుంది. ఈ సినిమా తో మరో భారి హిట్ దక్కించుకుంటుందన్న టాక్ ఉంది. అంతేకాదు మెగా హీరోలని బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతుందని సమాచారం. కాగా తాజాగా యంగ్ హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ రీమేక్ అంధాదున్ లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో నభా కాస్త బోల్డ్ గా కనిపించబోతుంది.

Sudden Surprise! Pooja Hegde to replace Rashmika - tollywood

ఈ సినిమాలతో పాటు మరో రవితేజ సరసన నటించనుందని అంటున్నారు. రమేష్ వర్మ – రవితేజ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో నభా నటించేందుకు ఇప్పటికే సైన్ కూడా చేసిందని అంటున్నారు. ఈ రకంగా ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న పూజా హెగ్డే, రష్మిక మందన్నలకే గట్టిపోటీ ఇవ్వబోతుందని చెప్పుకుంటున్నారు.