Vijay Devarakonda : నానీ రిజెక్ట్ చేసిన సినిమా విజయ్ దేవరకొండ మొదలు పెడుతున్నాడా…?

Vijay Devarakonda : ప్రస్తుతం నాని అంటే సుందరానికి.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కేరళ నటి నజ్రియా తొలిసారి తెలుగులో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇంతకు ముందు నాని నటించిన నిన్ను కోరి, టక్ జగదీష్ ల దర్శకుడు శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమా ఫైనల్ అయ్యాక ఒక లవ్ స్టోరీ లైను ను నానికి వినిపించటం జరిగిందట. కానీ నాని అప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా ఆసక్తి కనబరచలేదు.

శివ నిర్వాణ ఆ లవ్ స్టొరీ ని విజయ్ దేవరకొండ కు వినిపించగా వెంటనే విజయ్ సినిమాకు ఓకే చేశాడట. విజయ్ నుంచి ప్రస్తుతం లైగర్ సినిమా రానుంది . ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా, లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లోనే జనగణమన సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడే జనగణమన సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇవ్వటం జరిగినది కూడా తెలిసిందే. అయితే ఈ సినిమాను త్వరలోనే పట్టాలుఎక్కించే దానికి సిద్ధంగా ఉన్నారట.

ఈ సినిమాలో హీరోయిన్ గా విజయ్ దేవరకొండ కంటే సీనియర్ యాక్టర్ అయిన సమంత నటిస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో జరిగే ఈ ప్రేమ కథను ఎక్కువ శాతం సినిమా షూటింగ్ కాశ్మీర్ లో నే జరగబోతోందట. అంతేకాదు అప్పుడే లొకేషన్లు కూడా ఫైనల్ చేశారట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. విజయ్ దేవరకొండ సమంత ఇదివరకే మహానటి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా చేసినారు, ప్రస్తుతం ఈ సినిమాలో వీరి జోడి అలాగే వీరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి నెలకొంది.