త్రివిక్రమ్‌లో సరుకు అయిపోయింది.! ‘కారం’ సరిపోవట్లేదు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈ రోజు. కానీ, ప్యాన్సలో ఆ హుషారు ఎంత మాత్రమూ లేదు. సెలబ్రిటీల పుట్టినరోజు వేడుకలంటే ఆయా రోజుల్లో వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయన్న ఆశ వుంటుంది.

అయితే, పుట్టిన రోజున మహేష్‌ తాజా సినిమా ‘గుంటూరు కారం’కి సంబంధించి ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేని దుస్థితి. సినిమా బాగా వస్తే అభిమానుల కోసం ఏదో ఒక పోస్టర్ కానీ, గ్లింప్స్ కానీ రిలీజ్ చేసి వుండేవారేమో.

చూస్తుంటే సినిమా బాగా రాలేదన్న వినికిడి వినిపిస్తోంది. అసలే ఇప్పటికే ఈ సినిమాపై బోలెడంత నెగిటివిటీ వుంది. ఈ తరుణంలో గురూజీ త్రివిక్రమ్ ఇలా చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రో’ టైమ్‌లో కూడా గురూజీ స్టామినాపై పలు విమర్శలు వచ్చాయ్.

చూస్తుంటే ‘గుంటూరు కారం’ విడుదలయ్యే వరకూ డౌటే అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయ్. గురూజీకి ఎందుకీ పరిస్థతి.!