నారప్ప .. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అసురన్’ సినిమాకు నారప్ప అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. సురేష్ బాబు – కలైపులు ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీమేక్ సినిమా అయినా మన నేటివిటికి తగ్గట్టు కథలో చాలా మార్పులే చేశారట. వెంకటేష్ గెటప్ తో పాటు నారప్ప అన్న మాస్ టైటిల్ కి ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే తెలిసిన కథ కాబట్టి ఈ సినిమా కి పోటీ లేకుండా చూసుకుంటే వసూళ్ళు పరంగా నిర్మాతలకి నష్టాలు రాకుండా ఉండే అవకాశం ఉంది.
కాని ఇప్పుడు నారప్ప సినిమాకి పెద్ద సమస్య ఆచార్య సినిమా. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. స్ట్రైట్ సినిమా కావడం తో దేశ వ్యాప్తంగా ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తుండటం ఈ సినిమాకి మరొక పెద్ద ఎసెట్. ఇలాంటి సినిమాతో నారప్ప పోటీ అంటే కష్టమే అని చెప్పుకుంటున్నారు. నారప్ప ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేస్తున్నారు. మే 13 న చిరంజీవి ఆచార్య, మే 14 న వెంకటేష్ నారప్ప రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కాని ఇప్పుడు నారప్ప టీం డైలమాలో పడినట్టు సమాచారం.
అందుకే ఆచార్య సినిమాతో కాకుండా మరో డేట్ ని ఫిక్స్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా నారప్ప రిలీజ్ డేట్ మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 30న రానా ‘విరాటపర్వం’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత మే 10వ వరకు ఎలాంటి పెద్ద సినిమాలూ లేవు. అలాగే ‘ఆచార్య’ మే 13 న రిలీజ్ కానుంది. ఆ తర్వాత మే 28న ‘ఖిలాడి’ వస్తుంది. ఈ రకంగా చిరంజీవి సినిమాకు, రవితేజ సినిమాకు 13 రోజుల పైనే గ్యాప్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో నారప్ప రిలీజ్ కి మరొక డేట్ లాక్ చేసేలా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేట్ కే వస్తారా.. లేదా కొత్త డేట్ ని చూసుకుంటారా చూడాలి.