కార్తికేయ సీక్వెల్ సినిమాలో అనుపమ నటించడానికి కారణం అదేనా?

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తాజాగా కార్తికేయ 2 సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ ఇతర చిత్ర బృందం ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ఇకపోతే కార్తికేయ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి నటించారు. అయితే ప్రస్తుతం ఆమె స్థానంలో అనుపమ పరమేశ్వరన్ నటించడంతో అందరికీ పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి.కలర్స్ స్వాతి స్థానంలో అనుపమ నటించడానికి కారణం ఏమిటి ఉద్దేశపూర్వకంగానే కలర్స్ స్వాతిని తప్పించారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిఖిల్ కి ఇదే ప్రశ్న ఎదురు కావడంతో ఈయన అసలు విషయం తెలియజేశారు.

కార్తికేయ 2 లో హీరోయిన్ నార్త్ ఇండియాకి చెందిన అమ్మాయిలా ఉండాలి. ఈస్ సీక్వెల్ చిత్రంలో హీరోయిన్ పాత్ర అలాగే ఉంటుంది. అయితే నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో కలర్స్ స్వాతి ఏమాత్రం బాగుండదన్న ఉద్దేశంతోనే అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశామని ఈ సందర్భంగా నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో నటించడానికి గల కారణం తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.