ఆచార్య సినిమా కథ ఏంటో ఎవరికీ తెలియనిది. కాని నారప్ప కథ మాత్రం అందరికీ తెలిసిందే. ఎప్పుడో తమిళంలో వచ్చి భారీ సక్సస్ అయిన సినిమా. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ తమిళంలో మంచి కమర్షియల్ హిట్ సాధించి 100 కోట్ల పైనే వసూళ్ళు రాబట్టింది. తమిళంలో ధనుష్ కి ఇంత పెద్ద సక్సస్ దక్కడం ఇదే మొదటి సారి. దాంతో ఈ సినిమాని రీమేక్ చేయాలని సురేష్ బాబు డిసైడయ్యాడు. రీమేక్ రైట్స్ కొని వెంటకేష్ తో నారప్ప గా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే గనక రిలీజ్ అయి ఉంటే ఆ అంచనాలు వేరే ఉండేవి. టైటిల్ పోస్టర్ తో పాటు నారప్ప గా వెంకటేష్ లుక్ అదిరిపోయింది.
అయితే ఇప్పుడు నారప్ప సినిమా మీద అంచనాలు కాస్త మారినట్టు సమాచారం. పైగా ఈ సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాతో పోటీ పడుతోంది. వెంకటేష్ నారప్ప సినిమా కంటే మెగాస్టార్ ఆచార్య సినిమాకే ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో ప్రేక్షకుల్లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఎరగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య తెరకెక్కుతోంది. పైగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మల్టీస్టార్ గా రూపొందుతున్న ఆచార్య సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఆచార్య మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుండగా వెంకటేష్ నారప్ప మే 14 న రిలీజ్ చేయబోతున్నారు. మరి భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలలో ఎవరు బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. అయితే ఇప్పుడు ఆచార్య కంటే నారప్ప సినిమా కథ అందరికీ తెలినదే కావడం తో అదే పెద్ద మైనస్ అవుతుందేమో అని ఫిల్మ్ నగర్ లో చర్చలు సాగుతున్నాయి. కాని సురేష్ బాబు మాత్రం అసురన్ ఒరిజనల్ కథ లో కీలక మార్పులు చేయించాడట. కేవలం మేయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని కథ మొత్తం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చినట్టు సమాచారం. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్ట్ మొత్తం వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా అద్భుతంగా తయారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.