ఫైనల్ గా పూరి కొత్త ప్రాజెక్ట్ ఫిక్సైంది ఆ హీరోతోనేనా ..?

పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సమర్పణలో పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ – ఛార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ముంబై ధారావి లో ఈ సినిమా షూటింగ్ మొదలై షెడ్యూల్ కూడా పూర్తైంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ ఏకంగా ఈ సారి పాన్ ఇండియన్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించబోతున్నాడు.

Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next-  The New Indian Express

పూరి సినిమాలన్ని యూనివర్సల్ పాయింట్ తోనే తెరకెక్కుతుంటాయి. కాబట్టి ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేటయింది. అయితే ఈ సినిమా తర్వాత పూరి ఏ హీరో తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. విజయ్ తో సినిమా కంప్లీట్ చేసిన తర్వాత బాలయ్య సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే నాగార్జున తో అని, కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో అని.. లేదు మహేష్ బాబు తో అనిల్ సుంకర నిర్మాతగా పూరి నెక్స్ట్ సినిమా ఉంటుందని ఇలా చాలా వార్తలు వస్తున్నాయి.

కాని ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు. అలాగే పూరి ఎంతో ఇష్టపడి తెరకెక్కించాలనుకున్న జనగణమన ప్రాజెక్ట్ కూడా అలాగే హోల్డ్ లో ఉంది. మరి ఏ హీరో తో పూరి నెక్స్ట్ సినిమా ఉంటుందో తెలీదు గాని .. తాజా సమాచారం ప్రకారం ఆయన తర్వాత సినిమా కొడుకు ఆకాష్ తోనే ఉండబోతుందని అంటున్నారు. ఇంతకు ముందు కొడుకుతో మెహబూబా అన్న సినిమా తీశాడు పూరి. కాని ఆ సినిమా సక్సస్ కాలేదు. ప్రస్తుతం పూరి నిర్మాణంలో ఆకాష్ రొమాంటిక్ అన్న సినిమా చేస్తున్నాడు. కాగా తండ్రీ కొడుకుల కాంబినేషన్ లో త్వరలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ కానుందని సమాచారం.