గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ని టాలీవుడ్‌లో పట్టించుకోవట్లేదేం.?

‘గ్లోబల్ స్టార్ రామ్ చరణ్’ అంటూ మెగా అభిమానుల్లో కొందరు సోషల్ మీడియాలో నానా హైరానా పడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి అమెరికాలో ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు రామ్ చరణ్. ఈ క్రమంలో అమెరికన్ మీడియా ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటిస్తోంది.

ఇదంతా రామ్ చరణ్ వ్యక్తిగత వ్యవహారం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన దరిమిలా, అక్కడ నడుస్తున్న హంగామా. పైగా, ‘హెచ్‌సిఎ’ అవార్డుల ప్రదానోత్సవం వుంది. అందులో రామ్ చరణ్, ఎన్టీయార్.. ఇద్దరూ ఓ కేటగిరీలో అవార్డుల కోసం పోటీపడుతున్నారు.

ఇంత జరుగుతున్నా, టాలీవుడ్ పెద్దగా పట్టించుకోవడంలేదు. తెలుగు సినీ ప్రముఖులెవరూ సోషల్ మీడియాలో స్పందించకపోవడం రామ్ చరణ్ అభిమానులకు కొంత అసహనాన్ని కలిగిస్తోంది. రామ్ చరణ్ పీఆర్ టీమ్ అంత వీక్‌గా వుందా.? అనే చర్చ మొదలైంది.

అదే ఎన్టీయార్ అయి వుంటేనే.. ఈపాటికి వ్యవహారం వేరే లెవల్‌లో వుండేదే.!