అసలేమయ్యింది సమంతకి.? తీవ్ర అనారోగ్యమన్నారు.. నిజమే, ఆసుపత్రి పాలైంది. కోలుకుంది కూడా.! ‘ఖుషీ’ సినిమా విడుదల కావాల్సి వుంది. ‘సిటాడెల్ వెబ్ సిరీస్’ పూర్తయ్యింది.. అదీ విడుదల కావాల్సి వుంది.
ఒప్పుకున్న ప్రాజెక్టుల్లో కొన్నిటినుంచి తప్పుకుంది. అందులో ఒకటి రష్మిక చేతికి వెళ్ళింది. కొత్త ప్రాజెక్టులైతే సమంత ఏదీ ఒప్పుకోలేదుట. ప్రస్తుతానికైతే విహార యాత్రలో బిజీగా వుంది. కాదు కాదు, విదేశాల్లో సంప్రదాయ వైద్య చికిత్సల్ని తీసుకుంటోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం తాలూకు సారాంశం.
‘ఫిట్‌గానే వున్నాను..’ అంటోందిగానీ, కొత్త ప్రాజెక్టులకు సమంత ఒప్పుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సమంతని వేధిస్తోన్న ప్రధాన సమస్య.. మానసిక అనారోగ్యం.! విడాకుల వల్లనే ఈ సమస్య.. అని సమంత సన్నిహితులు చెబుతున్నార్ట.
కుటుంబ సభ్యులు, ఆమెకు మళ్ళీ పెళ్ళి చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.