టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్కిన్ షో కి హాట్ హాట్ గా కనిపించేదుకు ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు. ఇక ఇద్దరికి లక్కీ హీరోయిన్స్ అన్న పేరుతో పాటు ఇండస్ట్రీ వర్గాలలో ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఉంది. కాబట్టే టాలీవుడ్ లో ఈ ఇద్దరి హీరోయిన్స్ కి భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తుండటం తో పాటు భారీగాను రెమ్యూనరేషన్ ముట్టచెబుతున్నారని టాక్ ఉంది.
ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే డార్లింగ్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ అన్న సినిమా చేస్తుంది. యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఇటలీలో షూటింగ్ జరుపుతున్నారు. అలాగే అఖిల్ అక్కినేని కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా కూడా చేస్తుంది పూజా హెగ్డే. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఇక రష్మిక మందన్న సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అలాగే యంగ్ హీరో నాగ శౌర్య కి జంటగా కూడా రష్మిక మందన్న నటిస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పూజా హెగ్డే, రష్మిక మందన్న రెమ్యూనరేషన్ మీదే చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు 2 కోట్ల కి పైగానే డిమాండ్ చేస్తుండగా నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంటున్నారు.
కాగా పూజా హెగ్డే, రష్మిక మందన్న ల మాదిరిగా గ్లామరస్ గా కనిపించకపోయినప్పటికి ఫిదా బ్యూటీ సాయి పల్లవి కి ఉన్న టాలెంట్ అండ్ క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని సాయి పల్లవి కూడా 2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు చేస్తున్న సాయి పల్లవి రీసెంట్ గా నాని నటించబోతున్న శ్యామ్ సింగ రాయ్ లో నటిస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. మొత్తానికి రెమ్యూనరేషన్ పరంగా చూస్తే పద్దతిగా నటిస్తూనే పూజా హెగ్డే, రష్మిక మందన్న లని మించిపోయిందంటున్నారు.