Vikram: నటనలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి,విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్. ప్రస్తుతం కమల్ హాసన్,లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాని చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శాన్వీశ్రీవాత్సవ హీరోయిన్గా నటిస్తోంది.ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్స్ పతాకంపై రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో అలనాటి అందాల తార మహేశ్వరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండాఈ ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే,ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీ రోల్‌లో నటించబోతున్నాడన్న వార్త అటు బీటౌన్‌లో, ఇటు సౌత్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇటీవల అమితాబ్ బచ్చన్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారని,దాంతో చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం బిగ్ బీ విక్రమ్ సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశంలో కనిపిస్తాడట.కమల్ అంటే అమితాబ్‌కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే కమల్ అడిగిన వెంటనే ఈ పాత్ర చేయడానికి అమితాబ్ ఒప్పుకొన్నారని తెలుస్తోంది. ఈచిత్రానికి అనిరుద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 13న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.