రష్మికకి అదనపు చెల్లింపులట.! నిజమేనా.?

తెలుగులో రష్మిక మండన్న చేస్తోన్న సినిమా ‘పుష్ప ది రూల్’. హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూసేసింది రష్మిక. అవి కూడా ఓటీటీ సినిమాలే అయిపోయాయ్.! ఇంతకీ, ‘పుష్ప ది రూల్’లో రష్మిక పరిస్థితేంటి.? ఫెయిల్యూర్స్ వచ్చినాగానీ, రష్మిక స్టార్డమ్‌కి ఇప్పటికిప్పుడు వచ్చిన లోటేమీ లేదు.

ఎందుకంటే, టాలీవుడ్‌లోనూ హీరోయిన్ల కొరత వుంది. కొంతలో కొంత శ్రీలీల జోరు కనిపిస్తున్నా, రష్మికకి వుండే ఫాలోయింగ్ అలాగే కొనసాగుతోంది. కాగా, రష్మిక మండన్నకి ముందు అనుకున్నదానికంటే కాస్త అదనంగా చెల్లిస్తోందిట ‘పుష్ప ది రూల్’ నిర్మాణ సంస్థ. ఎందుకు.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

అసలంటూ రష్మిక పాత్ర నిడివి తక్కువని ప్రచారం జరుగుతున్న తరుణంలో, ఈ రెమ్యునరేషన్ గాసిప్ ఎలా బయటకు వచ్చిందబ్బా.? దీన్ని లీక్ అని పరిగణించాలా.? పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా.?