చిరంజీవి ఆచార్య సినిమాలోకి రాజమౌళి ? వామ్మో ఇది మామూలు రచ్చ కాదు ..?

చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ దేవాదాయ శాఖ అవినీతి కుంభకోణాల నేపథ్యంలో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకిక్కిస్తున్నాడని సమాచారం. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టోన్ ఏమిటో వెల్లడించే వీడియోని రిలీజ్ చేశారు. ఈ మూవీకి అత్యంత కీలకమైన ఆలయ ప్రాంగణంపై స్వయంగా వివరాల్ని అందించి సర్‌ప్రైజ్ చేశారు.

ఇక ఆచార్య టైటిల్ ఆ మధ్య రిలీజైన ఆచార్య మోషన్ పోస్టర్ కి మెగాభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి ఈ సినిమాలో పూర్తి విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా కొరటాల శివ ఈ సినిమాని తీసుకు రాబోతున్నారు. ఇక తాజాగా ఆచార్య నుంచి చరణ్ ప్రీలుక్ రిలీజైంది. ఫస్ట్ లుక్ కి ముందు ఈ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. మా సిద్ధ సర్వం సిద్ధం.. అంటూ కొరటాల శివ స్వయంగా రామ్ చరణ్ ప్రీ లుక్ రిలీల్ చేశారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆచార్య సినిమాలో చరణ్ పోషిస్తున్న సిద్ద పాత్రకి సంబంధించిన సీన్స్ ని రాజమౌళి తెరకెక్కిస్తాడని సమాచారం. మరి ఎంతవరకు నిజమో తెలీదు గాని ఈ టాపిక్ మాత్రం అందరిలో ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో భారీ మల్టీస్టారర్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా .. ఎన్.టి.ఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు.