పుష్ప సినిమా అతని తలరాత ని మార్చేయబోతోందా ? 

పుష్ప సినిమా మీద అందరి దృష్టి ఉంది. భారీ పాన్ ఇండియన్ సినిమా కావడమే అందుకు కారణం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత టాలీవుడ్ లో అంతటి క్రేజ్ ఉన్న సినిమాలలో పుష్ప కూడా ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క నటీ నటుడిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ సుకుమార్ పుష్పను కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకోసం దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన ఐటెం సాంగ్ రెడీ చేస్తున్నాడని ఆ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులేయబోతోందని వార్తలు వస్తున్నాయి. కాగా మొన్నటి వరకు పుష్ప సినిమాలో సునీల్ నటిస్తున్న వార్తలు వచ్చాయి. కాని అందులో నిజం లేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప సినిమాలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

అంతేకాదు సునీల్ నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించనుండగా కథను పూర్తిగా మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. హీరో అవకాశాలు లేక మళ్ళీ కమెడియన్ గా మారిన సునీల్ మధ్య మధ్యలో విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. కాని అవేవి సునీల్ కి ముందు ఉన్న క్రేజ్ ని తీసుకురావడం లేదు. ఇలాంటి సమయంలో పుష్ప సినిమా సునీల్ కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి అని మాట్లాడుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో సునీల్ ఎంత పాపులర్ కమెడియనో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలా ఉన్న క్రేజ్ ని హీరోలా మారి పోగొట్టున్నాడు. మళ్ళీ ఆ క్రేజ్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.