గోవిందుడి ‘గీత’ మారుతుందా.?

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవింద’ సినిమా గుర్తుంది కదా.? తక్కువ బడ్జెట్‌తో చాలా రిచ్‌గా ఆ సినిమాని తెరకెక్కించారు. లాభాల పరంగా చాలా చాలా పెద్ద సినిమా ‘గీత గోవిందం’. రష్మిక మండన్న హీరోయిన్ ఆ సినిమాలో.

సినిమా విడుదల సమయంలోనే సీక్వెల్ గురించిన చర్చ జరిగింది. సీక్వెల్ ఆలోచనలు జరుగుతున్నాయని దర్శకుడు పరశురామ్ పలు సందర్భాల్లో లీకులు ఇచ్చాడు కూడా.

అన్నట్టు, మహేష్‌తో ‘సర్కారు వారి పాట’ సినిమాని పరశురామ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ దర్శకుడే ఇప్పుడు ‘గీత గోవిందం’ సీక్వెల్ మీద ఫోకస్ పెట్టాడట. అయితే, ఈసారి ‘గీత’ మారబోతోందని సమాచారం. అదెలా కుదురుతుంది.? అంటే, తప్పదట.. రష్మిక డేట్స్ దొరకడం కష్టమవుతోందిట.

గీత లేకపోతే గోవిందుడికి ఎలా కుదురుతుంది.? అని సెటైర్లేస్తున్నారు. ఎందుకంటే, రియల్ లైఫ్‌లో రష్మిక – విజయ్‌ల మధ్య ‘కనెక్షన్’ వీరిద్దరూ కలిసి నటించే సినిమాలకి బోల్డంత అడ్వాంటేజ్ మరి.