నయనతార తల్లి కాబోతుందా.. విగ్నేష్ పోస్ట్ వెనుక ఉన్న అర్థం అదేనా?

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార తెలుగు తమిళ్ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ని నయనతార వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవల బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు.

వివాహం తర్వాత వీరిద్దరూ కూడా విదేశాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల విగ్నేష్ శివన్ పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం నయనతార గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. తొందర్లోనే నయనతార తన అభిమానులకు శుభవార్త చెప్పను ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవ్వటానికి కారణం విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్. పిల్లలతో కలిసి దిగిన ఫోటోని విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..`పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం.. భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేయాలి కదా` అంటూ రాసుకొచ్చాడు. దీంతో నయనతార ప్రస్తుతం గర్భవతిగా ఉందని .. అందువల్లే విగ్నేష్ ఈ పోస్ట్ షేర్ చేశాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే నిజంగానే నయనతార తన అభిమానులకు శుభవార్త చెప్పనుందా? ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే నయనతార స్పందించాల్సి ఉంటుంది.