Home News చూసే వారందరూ పిచ్చోల్లా నాగార్జునా ? అభిజిత్ కాలు కదిపితే సూపర్... చెయ్యి కదిపితే డూపర్...

చూసే వారందరూ పిచ్చోల్లా నాగార్జునా ? అభిజిత్ కాలు కదిపితే సూపర్… చెయ్యి కదిపితే డూపర్ అంటున్నావ్?

బిగ్ బాస్ సీజన్-3 లో తన యాంకరింగ్ తో హోస్ట్ గా సూపర్ హిట్ కొట్టిన నాగార్జున సీజన్-4 లో కూడా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నారు. ఈ సీజన్ కూడా ఇలానే అద్భుతంగా షో ని నడిపిస్తే ఇక సీజన్ 4 మాత్రమే కాదు తెలుగు బిగ్ బాస్ కు పర్మనెంట్ హోస్ట్ గా నాగార్జునని ఫిక్స్ చేస్తారేమో!. నాగార్జున యాంకరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే, కాని టీం రాసిచ్చిన స్క్రిప్ట్ మహిమో లేక మరేమో కాని హౌజ్ లో కొందరికి మాత్రమే నాగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అంటున్నారు.

Is Nagarjuna Talking Favorably To Abhijith?
Nagarjuna

అభిజిత్ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఒక అభిప్రాయము బిగ్ బాస్ అభిమానుల్లో ఉందట. సీజన్-2 లో కూడా నాని హోస్ట్ గా షో లో టాప్ కంటెస్టెంట్ కౌశల్ విషయంలో ఇదేవిధంగా పక్షపాత ధోరణి ఉందని గొడవ జరిగింది. అప్పట్లో కౌశల్ కి ఫాన్స్ విపరీతంగా పెరిగిపోయి ఆర్మీలా తయారయ్యి కౌశల్ ని ట్రేండింగ్ లో ఉంచేవారు, అందువల్లనేమో షో యాజమాన్యం కౌశల్ కి ఫేవర్ గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేదని టాక్ ఉంది. ఇప్పుడు కూడా బయట అభిజిత్ కు ఉన్న ఫాలోయింగ్… అతనికి పడే ఓట్లు చూసి షో నిర్వాహకులు అలా కంటెంట్ రాస్తున్నారేమో, అది నాగార్జున ఫాలో అవుతూ అందరికి డౌట్ వచ్చేలా చేస్తున్నారట.

ఈ ఆదివారం ఎపిసోడ్ లో కూడా అభిజిత్ వేసిన బుట్టబొమ్మ సాంగ్ డ్యాన్స్ సూపర్ అని నాగ్ స్పెషల్ గా మెన్షన్ చేశాడు. అతనికి డ్యాన్స్ రాదు కాని నాగార్జున అతన్ని డ్యాన్స్ వేయమని చెప్పి ఏదో అలా అలా కాలు కదపగానే సూపర్ డూపర్ అంటుంటాడు. మరి నాగార్జున మరీ ఇంత స్పెషల్ గా చెప్పడం వెనక రీజన్స్ ఏమి లేకపొయిన సరే మిగతా హౌజ్ మేట్స్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా నిరుత్సాహ పడుతున్నారు. అయితే నాగార్జునని… ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న అవినాష్ మీద మాత్రం నాగార్జున పంచులు వేస్తున్నారు. అవి సరదాకే అయినా అభిజిత్ ఏం చేయకపోయినా అతన్ని పొగడడం చూస్తుంటే అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి.

- Advertisement -

Related Posts

ఏపీలో బీజేపీ పార్టీకి మైనస్ అధ్యక్షుడు సోము వీర్రాజేనా ?

దేశంలో బీజేపీ పార్టీ ప్రస్థానం ఒక సీటు నుండి ఇప్పుడు వరుసగా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరటానికి ఆ పార్టీకి పనిచేసిన అధ్యక్షుల పాత్ర చాలానే ఉంది....

త్వరలో బీజేపీలోకి వెళ్లనున్న టీడీపీ, జనసేన నేతలు ఎవరో తెలుసా!!

తెలుగు రాజకీయాల్లో బీజేపీ కొత్త చరిత్రను సృష్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో స్థిరపడిన బీజేపీ ఏపీలో బలపడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే బీజేపీ సొంతంగా తానా బలాన్ని...

ఇంత అనుభవం పెట్టుకొని చంద్రబాబు ఇలాంటి తప్పు చేశాడేంటి?? టీడీపీ నాయకులే తల పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో...

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

Latest News