ఇండస్ట్రీ టాక్ : మరోసారి అలాంటి పాత్రలో నాగ చైతన్య.!

ప్రస్తుతం అక్కినేని హీరోల ఫామ్ ఏమాత్రం బాగాలేదు. వరుసగా అక్కినేని నాగార్జున, అఖిల్ మొన్ననే ఎన్నో అంచనాలు పెట్టుకున్న నాగ చైతన్య చిత్రం “కస్టడీ” లు భారీ ప్లాప్ లు గా నిలిచాయి. అయితే ఈ చిత్రాల్లో నాగ చైతన్య లైనప్ ఒకింత ఆసక్తిగా ఉందని చెప్పొచ్చు.

నాగ చైతన్య నటించిన “లవ్ స్టోరీ” చిత్రంలో తాను ఒక దిగువ కులస్తుని పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా మళ్ళీ కస్టడీ లో కూడా తాను అలంటి పాత్రనే పోషించాడు. దీనితో చైతు ఇలాంటి రోల్స్ నే చేయడానికే ఇష్టపడుతున్నాడా అనే టాక్ రాగ ఇపుడు మరో సినిమా ని కూడా ఇలాంటి రోల్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నారు.

ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చైతు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించనుండగా ఈ చిత్రంలో తాను ఓ బోట్ నడిపే వాడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. కాగా ఇందులో ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.

అంతే కాకుండా ఇది రియల్ లైఫ్ లో జరిగిన కథ అన్నట్టుగా కూడా సమాచారం. దీనితో మరోసారి నాగ చైతన్య అలాంటి పాత్రలో నటిస్తున్నాడని చెప్పాలి. కాగా ఈ సినిమా అయితే ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కానుండగా ఈ ఏడాది లోనే సెట్స్ మీదకి ఈ సినిమా వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.