సీనియర్ హీరో సినిమాని ఓకే చేసిన మృణాల్ ఠాకూర్.!

‘సీతారామం’ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌కి టాలీవుడ్‌లో పెరిగిన క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మాటకొస్తే బాలీవుడ్‌లోనూ అమ్మడి పేరు మార్మోగిపోతోంది.

అయితే, అవకాశాలు మాత్రం టాలీవుడ్ నుంచే పోటెత్తుతున్నాయట మృణాల్ ఠాకూర్‌కి. ప్రస్తుతం తెలుగులో నానితో ఓ సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్.

తాజాగా అందుతోన్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఓ సీనియర్ హీరో సినిమాలో మృణాల్‌కి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, సీనియర్ హీరోతో సినిమా అంటే కాస్త ఆలోచించమని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట. అయితే, ప్రముఖ సీనియర్ హీరో కావడంతో, మృణాల్ టెంప్ట్ అవుతోందట. ముందుకెళ్లాలనే అనుకుంటోందట.

దాదాపు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిందనీ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా సీనియర్ హీరో.? ఏంటా ప్రాజెక్ట్.? పూర్తి వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నాయ్.