తమన్‌కి రీప్లేస్‌మెంట్ దొరికేసినట్లేనా.?

హషిమ్ వహాద్ అబ్ఢుల్.. ఇప్పుడీ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెగ మార్మోగిపోతోంది టాలీవుడ్‌లో ఈ పేరు. ఇంతకీ ఎవరీ హషిమ్ వహాద్ అబ్ధుల్. ఇంకెవరైనా తెలియని వాళ్లుంటే వాళ్లకి పరిచయం చేయాలి కదా మరి.

‘ఖుషి’ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు వహాద్ అబ్ధుల్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ సినిమాకి వహాద్ అందించిన మ్యూజిక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

సినిమా రిజల్ట్ ఎలా వుండబోతోందనేది రిలీజ్ తర్వాత చూసుకోవచ్చు. కానీ, ఇప్పటికైతే మ్యూజిక్ డైరెక్టర్‌గా వహాద్ అబ్ధుల్ మాత్రం సక్సెస్ అయిపోయాడు. ఈయన పాటలు బాగా వినిపిస్తున్నాయ్. ‘ఖుషి’ టైటిల్ సాంగ్ దగ్గర్నుంచీ, ‘నా రోజా నువ్వే..’ ఆరాధ్య..’ పాటలు యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్.

దాంతో ట్రెండింగ్‌లోకి వచ్చేశాడీ మలయాళీ మ్యూజిక్ మాంత్రికుడు వహాద్ అబ్ధుల్. ఒకవేళ టైమ్ కలిసొచ్చి సినిమా హిట్ అయితే, ఇక అంతే, టాలీవుడ్‌కి మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికేసినట్లే. ఇంతవరకూ దేవిశ్రీ ప్రసాద్, థమన్ తప్ప చెప్పుకోదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ కనిపించడం లేదు టాలీవుడ్‌లో ఇంతవరకూ. సీనియర్లు ఫేడ్ అయిపోయారు.

మహతి స్వర సాగర్ లాంటి యంగ్ మ్యూజిక టాలెంట్ వున్నా, ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా వుంది వీళ్లకి. సో, థమన్‌ని, దేవిశ్రీని రీప్లేస్ చేయదగ్గ వారిలో వీళ్ల పేర్లు చేరలేదింతవరకూ. కానీ, ఉప్పెనలా దూసుకొచ్చాడు వహాద్ అబ్ధుల్.

‘ఖుషి’తో పాటూ, నానికి ‘హాయ్ నాన్న’, శర్వానంద్ కొత్త సినిమాకీ మ్యూజిక్ అందిస్తున్నాడు వహాద్. ఏమాత్రం ఈ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, మనోడు తిరిగి చూసుకోనక్కర్లేదంతే.