నాని 28వ సినిమా కి నజ్రియా ఫహద్ ని సెలెక్ట్ చేయడానికి ఇంత పెద్ద లాజిక్కుందా ..!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. కాగా ఈ సినిమా తర్వాత నాని వరసగా మరో రెండు సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

Nani's next titled Tuck Jagadish; Check out the first look | PINKVILLA

ఇప్పటికే టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న శ్యామ్ సింగ్ రాయ్ కోసం డిసెంబర్ నుంచి డేట్స్ ఇచ్చాడు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి – కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలక ముందే నాని మరో సినిమాని ప్రకటించాడు. ఈ సినిమా నాని కెరీర్ లో 28 కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Shyam Singha Roy: Nani, Sai Pallavi, Krithi Shetty To Play Lead Roles! Film  To Go On Floors In December

అయితే ఈ సినిమాలో నాని కి జంటగా మలయాళ, తమిళ సినిమాలలో బాగా క్రేజ్ సంపాదిచుకున్న నజ్రియా ఫహద్ ని ఎంచుకున్నారు మేకర్స్. అయితే చాలామంది నజ్రియా ఫహద్ ని ఎందుకు ఎంచుకున్నారో అన్న ఆలోచనలో ఉన్నారు. అందుకు కారణం ఇప్పటికే నాని తో నటించిన చాలా మంది హీరోయిన్స్ సక్సస్ లలో ఉన్నారు. టాలీవుడ్ లో వరసగా అవకాశాలు అందుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే మేకర్స్ ఒక లాజిక్ మూలానా నాని కి జంటగా నజ్రియా ఫహద్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది. నజ్రియా ఫహద్ కి తెలుగులో డెబ్యూ మూవీ అయినప్పటికి తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే నాని 28 సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే ఈ రెండు భాషల్లో క్రేజ్ ఉన్న హీరోయిన్ ని తీసుకుంటే సినిమాకి ప్లస్ అవుతుందని లాజికల్ గా ఆలోచించి నజ్రియా ఫహద్ ని ఫైనల్ చేసుకున్నారట. కాగా నజ్రియా ఫహద్ కి గతంలో రెండు మూడు సార్లు తెలుగు సినిమాలలో అవకాశాలు వచ్చి మిస్ అయ్యాయి. ఎట్టకేలకి నాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.