పోలీసు బందోబస్తు లేకపోతే పుష్ప షూటింగ్ జరగడం కష్టమే అంటున్నారు ..?

అలవైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత స్టైలిష్ స్టర్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే 4 పాటలు రెడీ చేశాడట రాక్ స్టార్. ఇక ఈ సినిమాలో ఐటం సాంగ్ చాలా ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో పుష్ప సినిమా సాగుతుందని అందుకోసం ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరణ జరపాలని ముందు నుంచి మేకర్స్ అంటున్నారు. కాగా ఈ భారీ షెడ్యూల్ ని ముందు కేరళ అడవుల్లో ప్లాన్ చేయగా కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు కేరళ అడవుల్లో షూటింగ్ చేసే పరిస్థితులు కష్టంగా మారాయట. దాంతో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడానికి ‘పుష్ప’ టీమ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దాదాపు 40 రోజుల పాటు ఫారెస్ట్ లో షూటింగ్ చేయనున్నారని సమాచారం. అల్లు అర్జున్ – రష్మిక మందన్న ల తో పాటు కీలక పాత్రలు పోషిస్తున్న నటులు.. చిత్ర యూనిట్ అందరూ కూడా షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా రిసార్ట్స్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. అయితే నక్సల్స్ ప్రభావిత అటవీ ప్రాంతం కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య ఈ సినిమా షూటింగ్ జరబోతుందని తెలుస్తుంది. పోలీసు బందోబస్తు లేకపోతే ఈ ప్రాతంలో షూటింగ్ జరపడం సాధ్యం కాదన్న మాట వినిపిస్తుది. ఒక రకంగా ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేసి మేకర్స్ పెద్ద రిస్కే చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.