పుష్ప సినిమా మీద వచ్చింది రూమరేనా ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ పుష్ప. ఇటీవలే ఈ సినిమా మారేడు పల్లి లోని ఫారెస్ట్ లో షూటింగ్ ప్రారంభం అయ్యింది. మూడు వారాలుగా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. అయితే రెండు రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యీనిట్ లో కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందని దాంతో పుష్ప సినిమా షూటింగ్ ఆపేసి చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చేశారని వార్తలు వస్తున్నాయి.

Fans decode Allu Arjun's Pushpa posters and discover hints | Telugu Movie  News - Times of India

అంతేకాదు ఈ సినిమా దర్శకుడు సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ సహా ఇన్నాళ్ళు షూటింగ్ లో పాల్గొన్న అందరూ సెల్ఫ్ క్వారెంటైన్ కు వెళ్లి పోయారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కారణంగా మళ్ళీ దాదాపు 15 – 20 రోజులు పుష్ప సినిమా షూటింగ్ బ్రేక్ పడిందని చెప్పుకుంటున్నారట. కాని ఇందులో వాస్తవం లేదన్న వార్త మళ్ళీ మొదలైంది. ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రి లోని అటవి ప్రాంతంలో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుందట. చెప్పాలంటే పుష్ప షూటింగ్ ఆగిందన్న విషయాన్ని అధికారకంగా ఎవరూ వెల్లడించలేదు.

దాంతో అభిమానులు ఇది నిజమా కాదా అన్న డైలమాలో ఉన్నారట. ఇప్పటికే ఎన్నో అంతరాయాల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చింది. ఇంతలోనే ఈ న్యూస్ రాగానే ఫ్యాన్స్ కొంత కంగారు పడుతున్నారట. మరి ఇందులో వాస్తవం ఉందా లేదా అన్నది మేకర్స్ క్లారిటీ ఇస్తే బావుంటుంది. కాగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందితున్నారు. తెలుగు తో పాటు మరో నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో సాలీడ్ హిట్ అందుకోవాలని పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకోవాలని గట్టి ప్రయత్నాలలో ఉన్నాడు.