గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టడం వెనుక అతని ప్రమేయం ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో అద్భుతమైన హిట్ అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేశారు. ఇకపోతే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పాటల రచయిత అనంత శ్రీరామ్ వెల్లడించారు.

ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి కృషి చేశారు. అలాగే ఈ సినిమాలో పెద్దపెద్ద నటీనటులు కూడా నటించారు. నయనతార సత్యదేవ్ సల్మాన్ ఖాన్ వంటి పెద్ద సెలబ్రిటీలు ఈ సినిమాలో నటించారు.ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో ఉండగా వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ చిరంజీవి నటిస్తున్నటువంటి ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంటుందని సలహా ఇచ్చారు.ఈ క్రమంలోనే ఇదే టైటిల్ పెట్టాలని తమన్ చిత్ర బృందాన్ని మొత్తం ఒప్పించారని అనంత శ్రీరామ్ వెల్లడించారు.

ఈ విధంగా తమన్ కోరిక మేరకే ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టామని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.ఇక ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కమర్షియల్ గా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నయనతార నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలతో బిజీ కానున్నారు.