సమంత చేతిలో రుద్రాక్షలకు కారణం అతనేనా… ఆయన వల్లే సమంత ఇలా మారిపోయిందా?

తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మయోసైటిసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతూ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఇలా చికిత్స తీసుకుంటూనే ఈమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు డబ్బింగ్ పూర్తి చేశారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నటువంటి ఈమె శాకుంతలం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన అనంతరం పూర్తిగా మారిపోయారని ఆ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈమె తెలుపు రంగు దుస్తులు ధరించడమే కాకుండా చేతికి రుద్రాక్ష మాల కూడా ఉండడంతో సమంతలో ఈ కొత్త మార్పుకు కారణం ఏంటి అనే విషయాల గురించి అభిమానులు చర్చలు జరుపుతున్నారు.

ఇక సమంత ఇలా జపమాల చేత పట్టుకొని ఆధ్యాత్మిక వైపు మల్లడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారని ఆయన మరెవరో కాదు సద్గురు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సద్గురు ఎన్నో విశేషాలను హితబోధ చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ నూతన ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సమంత సద్గురును ఎంతగానో అభిమానించి గౌరవిస్తారు.అయితే ఈమె మయోసైటిస్ వ్యాధి బారిన పడటంతో మానసిక ప్రశాంతత కోసమే సద్గురు చెప్పిన మాటలను వింటూ తరచూ జపం చేయడమే కాకుండా నిత్యం శ్లోకాలు చదువుతూ కాస్త మానసిక ప్రశాంతత పొందుతున్నారని తెలుస్తుంది.