బాలకృష్ణ అలాంటివాడా.. ఇప్పుడు చాలా కూల్ అయిపోయాను అంటున్న వెంకటేష్!

బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఫోర్త్ సీజన్లో ఇప్పటికే పలువురు సినీ తారులు వచ్చే సందడి చేశారు. ఇక తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ అన్ స్టాపబుల్ షో కి విచ్చేశారు. తన సినిమా గురించి కాకుండా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు వెంకటేష్. బొబ్బిలి రాజా, రాజా సినిమాలోని ఐకానిక్ చేనుల గురించి బాలకృష్ణ వెంకటేష్ ని అడిగినప్పుడు నాటి షూటింగ్ విశేషాలు వెంకీ మామ ఈ విధంగా షేర్ చేసుకున్నారు.

ముందు తనకి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని విదేశాల్లోనే ఏదైనా వ్యాపారం పెట్టుకొని సెటిలైపోవాలనుకున్నాడంట. అదే సమయంలో ఇండియాకి వచ్చి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే సరిగ్గా వర్క్ అవుట్ కాకపోవటంతో రామానాయుడు వెంకటేష్ ని సినిమాల్లోకి తీసుకు వచ్చినట్లు చెప్పాడు వెంకటేష్. సినిమాల్లోకి వచ్చిన పది పదిహేను ఏళ్ళు చాలా ఇబ్బందిగా అనిపించింది అని చెప్పాడు వెంకటేష్.

ఒకసారి తనకి ఒక షూటింగ్ లో జరిగిన గాయం వల్ల ఒక సైడ్ అంతా ఎప్పుడూ నొప్పి వస్తూ ఉండేది. దానివల్ల చిరాకు, కోపం ఎక్కువగా వస్తూ ఉండేదట. అసలు ఇదంతా మనకి అవసరమా, సినిమాలోకి ఎందుకు వచ్చానా అనిపించింది. కానీ ఇప్పుడు చాలా కూల్ అయిపోయాను, కోపమనేది లేదు అని చెప్పాడు వెంకటేష్. అలాగే మరొకసారి షూటింగ్ లో కాలికి గాయం అయినప్పుడు తాను రెస్ట్ తీసుకున్నానని కానీ అదే సమయంలో కాలికి దెబ్బ తగిలిన బాలకృష్ణ మాత్రం మొండిగా లేచి షూటింగ్ కి వెళ్లేవాడు.

అంతేకాకుండా తన దగ్గరికి వచ్చి షూటింగ్ కి వెళ్ళమని చెప్పేవాడని చెప్పాడు వెంకటేష్. బాలకృష్ణ అంతే ఎప్పుడు దెబ్బలు తగిలినా పట్టించుకోడు. బాలయ్య తప్ప అలా ఎవరూ చేయలేరు అని చెప్పారు వెంకటేష్. ఇంకా ఈ షోలో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు, సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీం అయిన దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసి రోలియో కూడా పాల్గొని సందడి చేశారు.