బాలయ్య సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా.?

2024 ఎలక్షన్స్ ప్రచారం కోసం బాలయ్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు నుంచి 8 నెలల పాటూ సినిమా షూటింగులకు పూర్తిగా బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట బాలయ్య. ఈలోగా తాను సైన్ చేసిన ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసేయాలనుకుంటున్నాడట. అనిల్ రావిపూడితో ప్రస్తుతం బాలయ్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

కాగా, టీడీపీ పవర్‌లోకి వస్తే మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా వున్నాడట బాలయ్య. ఒకవేళ మంత్రి అయితే, అటుపై సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారనీ ప్రచారం జరుగుతోంది. ఈలోగా కొడుకు మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేసేయాలని తొందరపడుతున్నాడట. అయితే, మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే క్రమంలో అనేక రకాల ప్రచారాలు మాత్రమే జరుగుతున్నాయ్ తప్ప.. ఆ దిశగా ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు.

ఏమాత్రం ఆ ఇష్యూ ముందుకు జరగడం లేదు. మరోవైపు సినిమాలపై మోక్షజ్ఞ అంతగా ఆసక్తి చూడంలేదని కూడా ఇన్‌సైడ్ టాక్. లేదు, లేదు త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ వుండబోతోందనీ మరో వైపు ప్రచారం. చూడాలి మరి, ఏం జరుగుతుందో.