అల్లు అర్జున్ స్ట్రైట్ తమిళ సినిమాకి దర్శకుడు ఫిక్స్..?

అల్లు అర్జున్ కి టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ .. మాలీవుడ్ .. శాండిల్ వుడ్ సినిమా ఇండస్ట్రీలలో కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాలు ఈ భాషల్లో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. అక్కడ మంచి హిట్స్ ని సాధిస్తున్నాయి. చెప్పాలంటే తెలుగులో ఉన్నంత క్రేజ్ తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కూడా ఉండటం విశేషం. ఈ క్రేజ్ కారణంగానే అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న పుష్ప సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 13 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కంప్లీట్ అవగానే అల్లు అర్జున్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. పొల్టికల్ బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తాడని చెప్పుకుంటున్నారు.

కాగా తాజాగా అల్లు అర్జున్ నటించబోయో మరో సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా అల్లు అర్జున్ తమిళంలో చేయబోయో స్ట్రైట్ సినిమా అని సమాచారం. కాగా ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ వహించనున్నాడని సమాచారం. ఇంతకముందు కూడా అల్లు అర్జున్ తమిళంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వచ్చాయి. కాని అది సాధ్యపడలేదు. అయితే ఈ సారి మాత్రం అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ పక్కా అని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారైనా అల్లు అర్జున్ తమిళంలో స్టైట్ సినిమాతో ఎంట్రీ ఇస్తాడా లేదా..!