ఇంటర్నేషనల్ వైట్ కాస్టింగ్.. కొత్త స్టాటజీతో సిద్ధమవుతున్న ఎస్ఎస్ఎంబి 29!

తెలుగు సినిమా లెవెల్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగానే రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మా తమ అభిమాన హీరో మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారంటే సినిమా అప్డేట్స్ కోసం ఎంతగా వెయిట్ చేస్తారో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా గురించి ఇంటర్నేషనల్ లెవెల్ లో సైతం చర్చలు జరుగుతున్నాయి అంటే ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏమిటో అర్థమవుతుంది. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్లకపోవడం గమనార్హం. ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యారంట. ఈ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడు కనిపించని డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారంట మహేష్ బాబు. ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి దృష్టి మొత్తం ఇప్పుడు ఈ సినిమా మీదే పెట్టినట్లు సమాచారం. అలాగే లోకేషన్ కూడా ఫైనల్ చేశారంట రాజమౌళి. అయితే పుష్ప 2 మారిన మార్కెట్‌ లెక్కలను దృష్టిలో పెట్టుకొని కొత్త స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. అడ్వెంచర్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి ప్రతి సీన్ ని ప్రాక్టీస్ చేసి తర్వాత సెట్స్ మీదకి తీసుకువెళ్తారట రాజమౌళి. అందుకోసమే లీడ్ యాక్టర్స్ తో ఒక వర్క్ షాప్ ని కూడా కండక్ట్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మహా జోరుగా సాగుతున్నాయి. ఇంతకు ముందు సినిమాలలో జక్కన్న నేషనల్ వైడ్ కాస్టింగ్ చేసేవారు అయితే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తయిన తరువాత 2025 ఏప్రిల్‌లో ఎస్ఎస్ఎంబీ 29ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు దర్శక ధీరుడు.