ఆచార్య టీజర్ కు ముందు ఆసక్తికర వీడియో .. ప్రీ టీజర్ రిలీజ్ !

తెలుగు సినిమా ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజాగా చిత్రం ఆచార్య. ఈ చిత్రం నుంచి ఈ రోజు టీజర్ రిలీజ్ కానుంది. జనవరి 29 సాయంత్రం 4.05 గంటలకు అభిమానులను అలరించేందుకు టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముహూర్తం నిర్ణయించింది. ఈ టీజర్ కోసం మెగా అభిమానులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు.

టీజర్‌కు ముందు ‘ఆచార్య’ ప్రీ టీజర్..స‌రికొత్త‌గా ప్రమోషన్స్

అయితే, టీజర్ కంటే ముందు కొణిదెల ప్రొ కంపెనీ స్వల్ప నిడివి ఉన్న మేకింగ్ వీడియోను పంచుకుంది. ధర్మస్థలి ప్రపంచంలోకి వెళ్లేముందు సంగ్రహావలోకనం అంటూ ట్వీట్ చేసింది. ధర్మస్థలికి రేపు తలుపులు తెరుచుకుంటున్నాయని వెల్లడించింది. ఆచార్య టీజర్ కు మార్గం సిద్ధం చేస్తున్నామంటూ ఈ ట్వీట్ లో తెలిపారు.

కాగా, చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బాగా బరువుతగ్గిన చిరు స్లిమ్ లుక్ లో పాత మెగాస్టార్ ను జ్ఞప్తికి తెస్తున్నారు. ఆచార్య చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పోస్టర్ లో చిరంజీవి లుక్ వైరల్ అయింది. ఎలాంటి ముందు అనౌన్స్ మెంట్ లేకుండా ప్రీ టీజర్ విడుదల చేసారు. అంటే మేకింగ్ విజువల్స్ అన్నమాట. ఆచార్య సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ నేపథ్యంలో కథ వస్తుందని వార్తలొచ్చాయి. అలాగే ధర్మస్థలి అనే గుడి చుట్టూనే ఈ కథ తిరుగుతుందని కొరటాల శివ కూడా కన్ఫర్మ్ చేసాడు. మొన్న మోషన్ పోస్టర్ లో ఇదే చూపించాడు. ఇప్పుడు టీజర్ విడుదల సమయంలో కూడా పూర్తిగా ధర్మస్థలి అంటూ ఫోకస్ చేసాడు. అక్కడే ఈ కథ అంతా జరుగుతుందని ఇన్ డైరెక్టుగా చెప్తూనే ఉన్నాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలపై పోరాడే నాయకుడిగా నటిస్తున్నాడు చిరంజీవి. ఫ్లాష్ బ్యాక్ లో చాలా పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు.