సూర్య “కంగువ” గ్లింప్స్ రిలీజ్ కి ఇంట్రెస్టింగ్ ప్లాన్!

ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుంచి భారీ బడ్జెట్ తో మంచి హైప్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లు ఏవన్నా ఉన్నాయి అంటే అవి రెండు చిత్రాలు ఒకటి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “లియో” కాగా మరొకటి దర్శకుడు శివతో విలక్షణ హీరో సూర్య నటిస్తున్న మాసివ్ పాన్ ఇండియా సినిమా “కంగువ” చిత్రాలే అని చెప్పాలి.

తమిళ సినిమా నుంచి ఇప్పుడు ఈ రెండు సినిమాలే మంచి హైప్ తో ఉన్నాయి. అయితే ఈ చిత్రాల్లో కంగువ నుంచి రీసెంట్ గానే మేకర్స్ సూర్య బర్త్ డే కానుకగా అవైటింగ్ గా ఎదురు చూస్తున్న గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్లింప్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మేకర్స్ రివీల్ చేశారు.

అయితే ఈ వీడియో రిలీజ్ కి మేకర్స్ ఇంట్రెస్టింగ్ టైం ని లాక్ చేసారని చెప్పాలి. కాగా ఈ జూలై 23 అర్ధ రాత్రి 12 గంటల మొదటి నిమిషం స్టార్ట్ అవుతూ సూర్య బర్త్ డే లోకి అడుగు పెట్టనుండగా ఆ మరు నిమిషం అయితే ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అంటే ఈ జూలై 23 అర్ధ రాత్రి 12:01 నిమిషానికి ఈ అవైటెడ్ గ్లింప్స్ రాబోతుంది.

మెయిన్ గా వారియర్ లుక్ లో సూర్య ని అలాగే అసలు సినిమాలో ఎలాంటి గ్రాండ్ విజువల్స్ చూపించబోతున్నారు అనే అంశాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో తెలియాలి అంటే ఈ రాత్రి వరకు ఆగాల్సిందే. కాగా ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ మొత్తం 10 భాషల్లో 3డిలో కూడా రిలీజ్ చేయనున్నారు.