గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పాలిటిక్స్ తో పాటుగా సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో అయితే దర్శకుడు సముద్రఖని తో చేస్తున్న చిత్రం “బ్రో” కోసం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా..
ఈ సినిమా విషయంలో అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అంశం బయటకి వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సముద్రఖని అయినప్పటికీ మరో దర్శకుడు త్రివిక్రమ్ కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంగతి తెలిసిందే.
దీనితో డెఫినెట్ గా మొన్న భీమ్లా నాయక్ లానే ఈ చిత్రానికి కూడా దర్శకుడు కాని దర్శకుడు త్రివిక్రమే అని ఓ టాక్ ఉంది. పైగా సినిమా సెట్స్ లో త్రివిక్రమ్ వచ్చి తన ఇన్వాల్వ్మెంట్ ని కూడా చూపించే వారని ఓ టాక్ వచ్చింది. అయితే వీటిపై లేటెస్ట్ గా హీరో సాయి ధరమ్ తేజ్ అయితే క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాకి త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ అసలు లేదని ఆయన కనీసం సెట్స్ లోకి కూడా రాలేదని. ఇప్పటివరకు కూడా ఆయన సినిమా సెట్స్ లోకి రాలేదు అని తెలిపాడు. ఐతే ఇది విన్న ఫ్యాన్స్ అయితే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక గురూజీ ప్రమేయం లేదు అంటే డెఫినెట్ గా సినిమా బాగానే వచ్చి ఉంటుంది అని కూడా కొందరు అంటున్నారు. మరి ఇంకా డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వరకు ఆగాలి.