‘గుంటూరు కారం’ ఆ ఘాటు ఎక్కువే.!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు చిత్ర విచిత్రమైన గాసిప్స్ వస్తూనే వున్నాయి. సినిమాకి ఎన్ని రోజులు షూటింగ్ ఇప్పటిదాకా పూర్తి చేశారు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంత పార్ట్ షూట్ చేశాక, అది బాగా రాలేదన్న కారణంగా, దాన్ని రద్దు చేసి.. మళ్ళీ కొత్తగా ట్రాక్ రెడీ చేశారన్న గుసగుసలు ఆ మధ్య వినిపించాయి.

జరగాల్సిన షూటింగ్ పార్ట్ ఎక్కువగానే వుంది. దాంతో, సినిమా ఎప్పటికి పూర్తవుతుంది.? అన్నదానిపై బోల్డన్ని అనుమానాలు షికార్లు చేస్తున్నాయ్. ‘అంతా సవ్యంగానే వుంది’ అంటున్నారు నిర్మాత. ఏం సవ్యంగా వుందో ఏమో.! త్రివిక్రమ్ అయితే, ‘గుంటూరు కారం’ కంటే, ఇతర వ్యవహారాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడాయె. దాంతో, ఘాటు బాగా ఇబ్బంది పెడుతోందట చిత్ర బృందాన్ని.