రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నయనతారా.. వైరల్ అవుతున్న కామెంట్స్?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయనతార ఆ తర్వాత ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే నయనతార ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది.

ఇటీవల తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార తన పర్సనల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తోంది. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఇటు పర్సనల్ లైఫ్ అటు కెరియర్ కూడా బ్యాలెన్స్ చేస్తోంది. ఇక ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండే నయనతార తాజాగా కనెక్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల గురించి నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో హీరో రవితేజ గురించి కూడా నయనతార చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గతంలో రవితేజతో కలిసి నటించిన నయనతార ఇటీవల ఇంటర్వ్యూలో రవితేజ గురించి మాట్లాడుతూ..తనకు ఉన్న ఫ్రెండ్స్ లో రవితేజ మంచి ఫ్రెండ్ అని వెల్లడించింది. అయితే ఇప్పుడు తమ ఇద్దరికీ కాస్త గ్యాప్ వచ్చిందని..ప్రస్తుతం రవితేజ తన తన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడని.. అలాగే తాను కూడా తన సినిమాలు, తన పర్సనల్ పనులతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని తెలిపింది. అయితే తాము ఇద్దరం కలిసి పనిచేసిన సమయంలో మాత్రం చాలా సరదాగా ఉండే వాళ్ళమని నయన్ తెలిపింది. అయితే రవితేజ సెట్ లో ఉన్నప్పుడు ఎక్కువగా జోక్స్ వేస్తూ నవ్వించేవాడిని..అప్పుడు మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని వెల్లడించింది.