నటనపై ఆసక్తి ఉంది కానీ హీరో కాలేను: అనిల్ రావిపూడి

డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. త్వరలో ఎఫ్ 3తో కూడా మంచి సక్సెస్ అందుకోనున్నాడు. దీంతో ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా.. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన మాటలతో బాగా సందడి చేశాడు.

ఇక అలీ.. హీరో కావాలనే ఆలోచన ఉందా అని అడగటంతో.. ఆర్టిస్టుగా చేయాలని ఉంది కానీ.. హీరోగా చేయాలని ఆశ లేదు.. హీరోగా చేయడం అనేది పెద్ద బరువు, పెద్ద బాధ్యత. మనపై సినిమాలు ఆడతాయా లేదా.. ఫ్లాప్ వస్తే ఎలా.. అని టెన్షన్ నేను పడలేను. అదే ఆర్టిస్టుగా అయితే డైలీ పేమెంట్ ఇస్తారు. టైం టు టైం పనిచేసి వచ్చేయవచ్చు అని అన్నాడు.