ఇన్సైడ్ టాక్ : “హనుమాన్” లో చిరు ఇలా కనిపిస్తారా??

తెలుగు సినిమా నుంచి మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక కొత్త ప్రయత్నంగా వస్తున్నా మరో భారీ చిత్రమే “హనుమాన్”. కాగా ఈ చిత్రంలో ఎలాంటి స్టార్ కాస్ట్ లేనప్పటికీ కూడా ఈ సినిమాపై భారీ హైప్ పాన్ ఇండియా వైడ్ గా నెలకొంది. యువ హీరో, దర్శకులు తేజ సజ్జ ఇంకా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ప్లాన్ చేసిన ఈ చిత్రం టీజర్ తోనే సెన్సేషనల్ హైప్ ని అందుకుంది.

ఇక ట్రైలర్ తో కూడా మంచి బజ్ ని తెచ్చుకున్న ఈ సినిమాలో హనుమాన్ పాత్రపై చాలా ఆసక్తి అందరిలో నెలకొంది. ట్రైలర్ లో చూపించిన ఫైనల్ షాట్ అయితే వెంట్రుకలు నిక్కబొడిచేలా చేసింది. కాగా ఈ షాట్ చూసాక చాలా మంది అది మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు.

అయితే ఇది ఆల్ మోస్ట్ చిరు అనే అన్నట్టుగా దర్శకుడు కూడా చెప్పాడు కానీ అది థియేటర్స్ లోనే చూసి తెలుసుకోండి అని చెప్పేసాడు. కాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ కూడా వస్తుండగా మరింత హైప్ స్టార్ట్ అయ్యింది. అయితే అసలు చిరు ఈ సినిమాలో ఉన్నారా లేదా అనే దానిపై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ బజ్ ఒకటి వినిపిస్తుంది.

కాగా ఈ చిత్రంలో హనుమాన్ గా మెగాస్టార్ కనిపించే ఛాన్స్ ఉందని కానీ అది తన యొక్క యానిమేషన్ వెర్షన్ లో కనిపించవచ్చని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే కంప్లీట్ గా నిజమైన చిరు లా కాకుండా ఒక 3డి పాత్రలో కనిపిస్తారని వినిపిస్తున్నాయి. మర్రి ఇవి ఎంత వరకు నిజం అనేది మాత్రం రిలీజ్ వరకు ఆగి చూడాల్సిందే.