ఇండస్ట్రీ టాక్ : “బ్రో” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే.!

గత రెండేళ్లలో అయితే టాలీవుడ్ నుంచి అదిరే అదిరే మల్టీ స్టారర్ చిత్రాలు వరుసగా వచ్చాయి. మరి వీటిలో సక్సెస్ డేట్ కూడా ఎక్కువే కాగా ఈ ఏడాదిలో కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి లాంటి సాలిడ్ చిత్రాలు కూడా వచ్చాయి. ఇక వీటి తర్వాత అయితే రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో ది అవతార్”.

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ల కలయికలో దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది. అయితే అవ్వడానికి రీమేక్ అయ్యినప్పటికీ కూడా ఇపుడు ఈ సినిమాపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం నుంచి ఇక అంతా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.

ఈ టీజర్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయ్యితే ఈ వచ్చే వారం రోజుల్లోనే వచ్చేస్తుందని తెలుస్తుంది. దీనితో అయితే ఈ జూన్ ఎడింగ్ లో ఈ చిత్రం వచ్చేస్తుంది అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ అలాగే కేతిక శర్మలు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ జూలై 28న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.