ఇండస్ట్రీ టాక్ : మరోసారి కబడ్డీ క్రీజ్ లో మహేష్.?

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన  హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి మరి అలా ఇప్పటికి “గుంటూరు కారం” వరకు వచ్చిన తన సినీ ప్రస్థానం అయితే భారీ మార్కెట్ అండ్ ఫాలోయింగ్ ని కూడా తీసుకొచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఇది వరకే యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మళ్ళీ గత 2003లో సంక్రాంతి జరిగిన హిస్టరీనే మళ్ళీ జరుగుతుంది అని టాక్ వచ్చింది.

దీనితో ఒక్కడు సినిమా వైబ్స్ దీనిపై వినిపించగా ఇపుడు ఇదే సినిమా రిలేటెడ్ గా మరో ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే ఆల్రెడీ ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ని ఓ కబడ్డీ ప్లేయర్ గా చూసిన మనం మళ్ళీ మహేష్ బాబు ని కబడ్డీ క్రీజ్ లో మహేష్ బాబు ని చూడబోతున్నామని సినీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా గుంటూరు కారంలో అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఏక్షన్ సీన్ ని కబడ్డీ తో డిజైన్ చేయగా మరి ఇందులో మహేష్ బాబు అదరగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సీన్ చాలా బాగా వచ్చింది అని సినీ వర్గాలు కూడాసి చెప్తున్నాయి. దీనితో అయితే మళ్ళీ రెండు దశాబ్దాలు తర్వాత మహేష్ బాబుని కబడ్డీ కోర్ట్ లో మనం చూడబోతున్నాం అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హారికా హాసిని వారు అయితే నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది.