ఇండస్ట్రీ టాక్ : “గాడ్ ఫాదర్” ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అలాగే టాలీవుడ్ కే గాడ్ ఫాదర్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రాలు రెండు ఈ ఏడాదిలో రిలీజ్ కి వచ్చాయి. అయితే వీటిలో “ఆచార్య” కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది కానీ నెక్స్ట్ కూడా మంచి అంచనాలు నడుమ వచ్చిన మరో చిత్రం “గాడ్ ఫాదర్”.

దర్శకుడు జయం మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్ అందుకొని మళ్ళీ చిరు కం బ్యాక్ అయ్యారు అని అయితే వాతలు వచ్చాయి. అయితే మొదటి వారం వరకు పర్వాలేదు కానీ నెక్స్ట్ మాత్రం గాడ్ ఫాదర్ డల్ అయ్యాడు. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించాడు కానీ ఆ సత్తా అయితే సరిపోలేదు.

దీనికి కారణం సినిమాకి జరిగిన బిజినెస్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఓటిటి లో కూడా వచ్చేసిన ఈ చిత్రం అయితే థియేటర్స్ లో ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అనూహ్యంగా ఫైనల్ రన్ గ్రాస్ చూస్తే కేవలం 120 కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్ వసూలు అయినట్టుగా తెలుస్తుంది.

అలాగే సుమారు 60 కోట్ల మేర గ్రాస్ ఉండొచ్చని తెలుస్తుంది. దీనితో అయితే టాక్ బాగానే వచ్చినా కూడా వసూళ్ల పరంగా మాత్రం సినిమా హిట్ స్టేటస్ తెచుకోలేనట్టే అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించగా సత్యదేవ్, నయనతార అలాగే సునీల్ తదితరులు నటించారు.