ఇండస్ట్రీ బజ్ : “హనుమాన్” లో మెగాస్టార్ ఊహించని రోల్.?

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ గా అలాగే ప్రిస్టేజియస్ సినిమాగా ఉన్న మరో భారీ చిత్రం “హనుమాన్”. యంగ్ హీరో తేజ సజ్జ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మాసివ్ చిత్రం ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర మరో పాన్ వరల్డ్ సినిమాగా అయితే రిలీజ్ కి రానుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ పనులు ఇప్పుడు శరవేగం జరుగుతుండగా బెస్ట్ అవుట్ పుట్ నిమిత్తం మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసేసారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఓ ఊహించని వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

ఈ చిత్రం కోసం అయితే ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని అతి ముఖ్య పాత్ర చేయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మెగాస్టార్ కి హనుమాన్ అంటే ఎంత ఇష్టమో అలాగే తన కుటుంబం అంతా కూడా ఆంజనేయ భక్తులే అని తెలిసిందే. మరి ఈ కోణంలో అయితే చిరంజీవిని హనుమాన్ చిత్రంలో క్లైమాక్స్ లో హనుమాన్ పాత్రలో చూపించే సన్నాహాలు చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం హనుమాన్ యూనిట్ చిరు తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. అయితే మెగాస్టార్ ని హనుమాన్ రూపంలో చూడడం అనేది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కానీ ఈ వార్త ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇలాంటి డివోషనల్ రోల్ లో అయితే మెగాస్టార్ కనిపిస్తే అది ఈ చిత్రానికే బిగ్గెస్ట్ హైలైట్ అవుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.