కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ ఇండియన్ 2. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇంకా 20 శాతం మాత్రమే పెండింగ్ ఉందంట. 2001లో కమల్ హాసన్, తో శంకర్ ఇండియన్ మూవీ చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. తెలుగులో భారతీయుడు టైటిల్ తో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించింది.
ఇండియన్ మూవీ శంకర్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది. మరల 22 ఏళ్ళ తర్వాత ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉదయనిది స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి స్టాలిన్ ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసిందని క్లారిటీ ఇచ్చారు.
ఇండియన్ 2 అవుట్ పుట్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నానని, శంకర్, కమల్ కాంబినేషన్ లో ఉన్న అంచనాలకి తగ్గట్లుగానే ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ లో ఇండియన్ 2 మూవీ రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఇండియన్ 3 పైన కూడా చర్చలు జరుగుతున్నాయని లీక్ చేయడం విశేషం.
ఇండియన్ 2 కి వచ్చే రెస్పాన్స్ బట్టి మరల కమల్, శంకర్ ఇండియన్ 3 మూవీని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందంట. సీజీ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని. అది కంప్లీట్ కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో ఏప్రిల్ లో రిలీజ్ అనుకుంటున్నట్లు స్టాలిన్ చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసే చిత్రం అవుతుందని నమ్మకంగా చెప్పారు.
మొత్తానికి శంకర్ ఫోకస్ అంతా ఇప్పుడు పూర్తిగా ఇండియన్ 2 మీదనే ఉందన్న మాట. ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్న నేపథ్యంలో అది కంప్లీట్ చేసి రామ్ చరణ్ తో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీపై ఫోకస్ పెట్టె ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.