సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 26 ఏళ్ళ తర్వాత ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాని శంకర్ తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక కమల్ హాసన్ కూడా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో షూటింగ్ చివరి దశకి వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఈ సినిమాలో ఏకంగా ఏడు మంది విలన్స్ ని శంకర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. వారందరికీ కథలో మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ విలన్స్ లో సముద్రఖని, వైరిముత్తు ప్రధానంగా ఉంటారని సమాచారం. వారితో పాటుగా మరో ఐదు మంది ప్రధాన విలన్స్ ని తెరపై దర్శకుడు శంకర్ చూపించాబోతున్నారు.
ఇక ఇండియన్ కి సీక్వెల్ స్టొరీ కావడంతో కచ్చితంగా సమాజంలో కరప్షన్ పాయింట్ మీదనే కథని చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మూవీ కోసం కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా యుద్ధ విద్యలు విద్యలు నేర్చుకుంది. ఈ నేపధ్యంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని తమిళనాడులో ఫేమస్ ప్లేస్ అయిన ధనుష్కోటిలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
దీంతో పాన్ ఇండియా లెవల్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అనిరుద్ వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో ఏకంగా పది సినిమాల వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా అతని చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది. వీటిలో చాలా వరకు పాన్ ఇండియా కథలే కావడం విశేషం. ఇదిలా ఉంటే కమల్ హాసన్ నుంచి విక్రమ్ తర్వాత వస్తున్న సినిమా కావడం. అలాగే ఇండియన్ మూవీకి సీక్వెల్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.