సావిత్రి గదిలో ఆ హీరో ఫోటోలు తప్ప ఎవరివి ఉండేవి కాదు.. ఆ హీరో ఎవరంటే?

సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తూ నటించే నటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్రకు అనుగుణంగా ఇట్టే నటిస్తూ మహానటి అనే బిరుదును కూడా కైవసం చేసుకున్నారు.ఇలా భాషతో సంబంధం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సావిత్రి చివరి క్షణాలు చాలా ఇబ్బందికరంగా కొనసాగాయని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు సావిత్రి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సావిత్రి ఎక్కువగా కృష్ణుడు పాత్రలలో నటించడానికి ఇష్టపడే వారిని ఆయన తెలిపారు ఇక ఈమె అద్భుతమైన డాన్స్ చూసి జమున తండ్రిగారు మంత్రముగ్ధుడయ్యారు. ఈ క్రమంలోనే సావిత్రిని సైతం జమున లాగే తన కూతురితో సమానంగా భావించి తనని చూసుకున్నారని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.

ఇకపోతే సావిత్రి గారికి మల్లెపూలు అన్న వర్షం అన్న మహా ఇష్టం మల్లెపూలు ఇష్టం కావడంతో ఎప్పుడు తను తల నిండా మల్లెపూలుతోనే మనకు కనిపించేవారని ఈయన తెలిపారు.సావిత్రి గది కనక చూస్తే ఎప్పుడు ఆమె గదిలో హీరో జెమినీ గణేషన్ తో తను కలిసి దిగిన ఫోటోలు గది మొత్తం ఉండేవని, అంతలా ఆమె నటుడు జెమినీ గణేష్ ను ప్రేమించిందని రామారావు తెలిపారు. ఇలా తనని ప్రేమించింది కనుక కొన్ని విషయాలలో సావిత్రి గారు తట్టుకోలేకపోయారని ఈమె తెలియజేసారు.