ఉలగనయగన్ కలం హాసన్ పేరు తెలియని ఇండియన్ మూవీ లవర్ ఎవరూ ఉండరు. మరి కమల్ హాసన్ ఇప్పుడు పలు భారీ సినిమాలు వరుసగా నటిస్తుండగా ఈ చిత్రాలు మాత్రమే కాకుండా తాను నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాను ఎప్పుడు నుంచి నిర్మాతగా దర్శకునిగా కూడా ఉండగా తాను తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పేరిట అయితే ఇప్పుడు ఓ భారీ చిత్రాలు నిర్మాణ సంస్థ నడుపుతున్నారు. గత ఏడాది తన నిర్మాణంలోనే వచ్చిన తన చిత్రం “విక్రమ్” సెన్సేషనల్ హిట్ అయ్యి కమల్ హాసన్ కి ఉన్న అప్పులు అన్నిటినీ తీర్చేసి మళ్ళీ కమల్ ని కింగ్ లా నిలబెట్టింది.
ఇక రీసెంట్ గానే యంగ్ హీరో శివ కార్తికేయన్ సాయి పల్లవి కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని కూడా కమల్ హాసన్ తన బ్యానర్ లో స్టార్ట్ చేశారు. అయితే లేటెస్ట్ గా తమ బ్యానర్ పేరు వాడుకొని కొందరు తమిళ నాడులో మోసాలు చేస్తున్నట్టుగా వారి దృష్టికి వచ్చింది. దీనితో వెంటనే ఈ అంశంపై కమల్ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.
తాము ఇపుడు ఎవరినీ కూడా నటీనటులను ఎంపిక చేసే ఏజెంట్ ని తీసుకోలేదని అలా ఎవరికైనా పోస్టులు కానీ మెయిల్స్, మెసేజ్ లు వచ్చినా నమ్మవద్దని తెలిపారు. అలాగే ఇలా తమ పేరు వాడుకొని ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిని వదలం అని ఖచ్చితంగా లీగల్ ఏక్షన్ కూడా తీసుకుంటామని హెచ్చరించారు.