వైష్ణవి చైతన్య ఫోన్ నెంబర్ కావాలా.. అయితే ఈ ఫోటో చూడండి!

Vaishnavi Chaitanya: నటి వైష్ణవి చైతన్య ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య షణ్ముఖ్ జస్వంత్ సరసన సాప్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ విధంగా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య తాజాగ నాగశౌర్య వరుడు కావలెను చిత్రంలో కీలక పాత్రలో నటించారు.అదేవిధంగా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న బేబీ అనే చిత్రంలో హీరోయిన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా వైష్ణవి చైతన్య సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే వైష్ణవి చైతన్య తాజాగా అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులతో కలిసి ఆస్క్ మీ ఏనీథింగ్ అనే సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ తన నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే కొందరు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని ప్రశ్నించగా తనకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ ఫోటో పెట్టారు.

మరొక నెటిజన్ మీ ఫోన్ నెంబర్ ప్లీజ్ అంటూ ఆమెను తన ఫోన్ నెంబర్ అడిగారు. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన ఫోన్ నెంబర్ చెబుతూ 9**27*1అని తన ఫోన్ నెంబర్ చెప్పేసారు. ఈ విధంగా తన ఫోన్ నెంబర్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇక ఈమె నెటిజన్లు అడిగిన ప్రశ్నలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.