యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ హీరోలలో ఒకడిగా నాగ శౌర్య పేరు వినిపిస్తుంది. అమ్మాయిలకి మోస్ట్ ఫేవరేట్ అని చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్స్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. తరువాత ప్రవీణ్ సత్తారు చందమామ కథలు మూవీలో ఒక స్టొరీలో లీడ్ రోల్ లో కనిపించాడు.
అయితే సోలోగా మొదటి మూవీ మాత్రం ఊహలు గుసగుసలాడే. ఈ సినిమా నాగ శౌర్యకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో వచ్చిన ఈ చిత్రంతోనే రాశిఖన్నా కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. తరువాత దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాలో నాగశౌర్య నటించాడు. ఈ సినిమాలో అజిత్ శౌర్య తండ్రి పాత్రలో కనిపించాడు.
ఈ చిత్రం ఓ మోస్తరు హిట్ అయ్యింది. లక్ష్మి రావే మా ఇంటికి చిత్రంతో హిట్ ని సొంతం చేసుకున్న కమర్షియల్ గా మరీ పెద్ద సక్సెస్ అయితే కాదు. అయితే నాగ శౌర్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అంటే వెంటనే చలో సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకొని నాగశౌర్యకి కెరియర్ పరంగా ఊపు తెచ్చింది. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయిపొయింది.
అయితే చలో తర్వాత శౌర్య నుంచి 10 సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వాటిలో కళ్యాణ్ వైభోగమే, ఓ బేబీ, వరుడు కావలెను సినిమాలు హిట్ కేటగిరీలోకి వచ్చిన మరీ స్టార్ ని చేసేంత స్థాయిలో అయితే లేవు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. అయితే కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని మాత్రం నాగశౌర్య ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏవీ చేయలేకపోయాయి.
తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందనే టాక్ వచ్చిన, సెకండాఫ్ మాత్రం కంప్లీట్ గా గాడితప్పిందని ఆడియన్స్ నుంచి వస్తోన్న రివ్యూ. దీంతో మరో ఫ్లాప్ ని శౌర్య తన ఖాతాలో వేసుకున్నట్లే అయ్యింది. ఈ చిత్రంపై నాగ శౌర్య చాలా నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఆశించిన రిజక్ట్ ఇవ్వలేదు. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పోలీస్ వారి హెచ్చరిక, అలాగే లవ్ స్టొరీతో నారి నారి నడుమ మురారి సినిమాలు చేస్తున్నాడు. అయితే శౌర్యకి జగపతిబాబు, శ్రీకాంత్ తర్వాత ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ని అందుకున్నాడు. కమర్షియల్ స్టార్ గా మాత్రం బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ కాలేదని చెప్పాలి.