అలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

కల్కి 2898 ఏడి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు దర్శకుడు అశ్విన్. 600 కోట్లతో సినిమాని నిర్మిస్తే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా కల్కి 3102 బిసి మూవీని త్వరలోనే సెట్స్ మీదికి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు నాగ్ అశ్విన్. అయితే ఈ మధ్యనే ఒక ఈవెంట్లో పాల్గొన్న ఈ దర్శకుడు కల్కి సినిమా గురించి కృష్ణుడి పాత్రధారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఈ ఈవెంట్లో ఒక అభిమాని కృష్ణుడి పాత్రధారి కి టాలీవుడ్ లో ఏ హీరోని మీరు సెలెక్ట్ చేసుకుంటారు అని అడగగా నేను శ్రీకృష్ణుడి ముఖాన్ని చూపించాలని అనుకోవడం లేదు, అయితే శ్రీకృష్ణుడిని ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయాలంటే మాత్రం మహేష్ బాబు పర్ఫెక్ట్ ఛాయిస్. ఈయన కల్కి సినిమాలో కృష్ణుడిగా చేసి ఉంటే ఈజీగా రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి ఉండేదేమో.

మహేష్ బాబు గారి ఖలేజా సినిమా చాలా ఇష్టం ఆయన పూర్తిగా దేవుడిగా చేస్తే ఆ సినిమా టీజర్ రిలీజ్ కి ముందే ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని చెప్పారు నాగ్ అశ్విన్. ఇక సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ని అర్షద్ లాంటి వ్యక్తులు తమ విముఖతని వ్యక్తం చేశారు. అయితే ఎవరి అభిప్రాయాలు వారివి. వారికి భైరవ పాత్ర నచ్చలేదేమో కానీ ఈ మధ్యనే తనను కలిసిన ఇద్దరు చిన్న పిల్లలు వారికి భైరవ పాత్ర నచ్చిందని నాకు చెప్పారు.

పిల్లలు ఎప్పుడూ బెస్ట్ ఆడియన్స్ అని చెప్పాడు అశ్విన్. ఇక సినిమాని రెండు భాగాలుగా తీయడం వెనుక ఉన్న స్టోరీని కూడా చెప్పాడు అశ్విన్. కల్కి సినిమాని పెద్ద కథ, సింగిల్ పార్ట్ అనే కాన్సెప్ట్ తోనే సినిమా తీశాము కానీ ప్రభాస్ సినిమా రెండు భాగాలు అయ్యేలా ఉంది అన్నారు. అయితే నేను ఎడిటింగ్ లో కట్ చేసేద్దాం అని చెప్పేవాడిని కానీ చిట్టీలు వేసి సినిమాని రెండు పార్ట్ లుగా తీశాం అంటూ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెప్పాడు నాగ్ అశ్విన్.