మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడిచేస్తోంది.ఇక ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిరంజీవి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన కేవలం సినిమా విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా తన కోడలు బిడ్డకు జన్మనివ్వబోతుంది అన్న సంతోషాన్ని కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ప్రస్తావనకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ త్వరలోనే మా ఫ్యామిలీలో మెమొరబుల్ డే రాబోతుందని ఈయన తెలిపారు. ఆ మూమెంట్ కోసం మేమంతా చాలా ఎదురు చూస్తున్నామని చిరంజీవి తెలియచేశారు. ఈ క్రమంలోనే యాంకర్ మరోసారి ప్రశ్నిస్తూ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ… ఎగ్జాక్ట్గా తనకు డెలివరీ డేట్ తెలియదని అయితే మెగా వారసుడు కనుక ఆగస్టులో పుడితే నా లైఫ్ లో అది ఎప్పటికీ మర్చిపోలేని రోజు అంటూ తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా ఆగస్టులోనే రానున్న నేపథ్యంలో ఈయన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టులో పుడితే నాకన్నా సంతోషించే వాళ్ళు లేరని ఆరోజు నా జీవితంలో గుర్తుండిపోతుందంటూ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.అయితే ఉపాసన జూన్ లేదా జూలై నెలలోనే డెలివరీ కాబోతుందని మరికొన్ని నెలలలోనే బుల్లి మెగా వారసుడు రాబోతున్నారని తెలుస్తోంది.