శివకార్తికేయన్ కి జన్మలో మ్యూజిక్ చెయ్యను – ఇమాన్ సెన్సేషనల్ కామెంట్స్ 

తమిళ సినిమా నాట మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్ లో శివకార్తికేయన్ కూడా ఒకడు. తాను తన స్వశక్తి తో పైకి ఎదిగాడు అని చాలా మంది అతన్ని అభిమానిస్తారు. అంతే కాకుండా శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది.

దీనితో పాటుగా తన సినిమాలు చూసినా కూడా దేనికది డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ వచ్చిన శివ కార్తికేయన్ పై తాజాగా తమిళ నాటికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు డి ఇమాన్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

శివ కార్తికేయన్ నన్ను చాలా మోసం చేసాడు నిజానికి వెన్ను పోటు పొడిచాడు అని అది నేను చాలా లేట్ గా గమనించాను. ఇది మా ఇద్దరికి మధ్య పర్శనల్ అంశం నేను దానిని బయటకి చెప్పలేను కానీ నాతో మంచిగా ఉంటూనే శివకార్తికేయన్ అంత నమ్మక ద్రోహం చేస్తాడు అని అసలు అనుకోలేదని చెప్పాడు.

అలాగే ఒకవేళ భవిష్యత్తులో సినిమాలు చేయాల్సి వస్తే అనే దానిపై కూడా మాట్లాడుతూ అది ఈ జన్మలో అయితే అసలు జరగదు అని బహుశా వచ్చే జన్మ అంటూ ఉంటే అందులో నేను మ్యూజిక్ డైరెక్టర్ గా తాను హీరోగా పుడితే అప్పుడు చేస్తాను అని ఇమాన్ తెలిపాడు. అయితే అసలు కారణం ఏమిటి అనేది మాత్రం ఇంకా బయటకి క్లారిటీగా రాలేదు కానీ శివకార్తికేయన్ లాంటి హీరోపై ఇంత స్థాయి కామెంట్స్ చేయడం అనేది పెద్ద ఎత్తున ఇపుడు చర్చకు దారి తీసింది.